తల్లి కళ్లెదుటే కన్నబిడ్డల రక్తపాతం.. అన్నను కుక్కర్‌తో కొట్టి చంపిన తమ్ముడు
Younger brother who beat Anna to death.మద్యం మత్తులో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో అన్నపై
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2021 11:41 AM ISTమద్యం మత్తులో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో అన్నపై తమ్ముడు కుక్కర్‌తో దాడి చేశాడు. తన కళ్లెదుటే అన్నాదమ్ములిద్దరూ గొడవ పడుతున్నా వారిని ఆపలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లి పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. తమ్ముడి దాడిలో తీవ్రంగా గాయపడిన అన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు దుండిగల్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్ లో విశాఖపట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి భరత్ భూషణ్ 35 సాయి తేజ 28 సంతానం. కొద్దికాలం క్రితం శ్రీమన్నారాయణ మరణించగా.. వరలక్ష్మీ గత పదేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. అన్నదమ్ములు ఇద్దరూ జులాయిగా తిరుగుతూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి (డిసెంబర్ 24)న ఇద్దరూ తాగి గొడవ పడ్డారు.
ఆగ్రహాంతో తమ్ముడు సాయితేజ కుక్కర్‌తో అన్న భరత్‌భూషణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. భరత్ భూషణ్ స్పృహ తప్పి పడిపోవడంతో.. తమ్ముడు సాయితేజ కూడా పడుకుండిపోయాడు. ఉదయం నిద్రలేచిన సాయితేజ.. అన్న భూషణ్‌ను నిద్రలేపేందుకు యత్నించగా.. ఎంతకీ అతడు లేవలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్థారించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అమ్మ కదల్లేని పరిస్థితుల్లో ఉండడంతో భరత్‌కు అంత్యక్రియలు నిర్వహించేవారు లేక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి శవాగారానికి తరలించారు.