దారుణం..అక్కను బాత్రూమ్‌లో హత్య చేసి ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది

By Knakam Karthik
Published on : 18 March 2026 7:01 PM IST

Crime News, Hyderabad, Rangareddy, Abdullapurmet, Murder Case

దారుణం..అక్కను బాత్రూమ్‌లో హత్య చేసి ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. చెడు మార్గంలో తిరుగుతోందనే అనుమానంతో తమ్ముడు తన సొంత అక్కను హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలు నీలా (40) కొన్నాళ్ల క్రితమే ఆమె భర్త మరణించగా, అప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న తమ్ముడు పప్పు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య అనంతరం పప్పు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. అక్కను బాత్రూమ్‌లో ముక్కలుగా నరికి, శరీర భాగాలను గోనె సంచిలో పెట్టి కారులో తీసుకెళ్లి మజీద్‌పురా చెరువులో పడేశాడు. కొన్ని భాగాలను చెరువు పక్కనున్న చిట్టడవిలో కూడా పారవేశాడు. ఇదిలా ఉండగా, మార్చి 2న నీలా సెల్‌ఫోన్ నుంచి తనకే తాను మెసేజ్‌లు పంపుకుని, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత మార్చి 8న అక్క కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందని కూడా చెప్పాడు. అయితే పప్పు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ జరపగా, అసలు విషయం బయటపడింది. మజీద్‌పురా చెరువులో గుర్తించిన శరీర భాగాలతో కేసు ఛేదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story