సహజీవనం చేస్తోన్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలోకి మూడో యువతి.. నడ్డిరోడ్డుపై దారుణం

Young Woman Fatally Assaulted Her Friend On Street Over Homosexual Relationship In Karnataka. ఓ ప్రైవేట్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చదువుకుంటున్న ఇద్దరు యువతులు స్వలింగ సంపర్కంపై గొడవ పడ్డారు.

By అంజి  Published on  21 Oct 2022 4:21 PM IST
సహజీవనం చేస్తోన్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలోకి మూడో యువతి.. నడ్డిరోడ్డుపై దారుణం

ఓ ప్రైవేట్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చదువుకుంటున్న ఇద్దరు యువతులు స్వలింగ సంపర్కంపై గొడవ పడ్డారు. ఆ తర్వాత నడిరోడ్డుపై కొట్టుకున్నారు. రేడియం కట్టర్‌తో దారుణంగా దాడి చేసుకున్నారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు. అయితే ఈ ఇద్దరు యువతులు గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని, మధ్యలోకి మూడో యువతి ఎంట్రీతో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోకి దావణగెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

దావణగెరె పట్టణంలోని శాంతినగర్‌లో ఓ ప్రైవేటు కాలేజీలో గ్రాడ్యుయేషన్​ చదువుతున్న ఇద్దరు యువతులు చాలా సన్నిహితంగా ఉండేవారు. వారి స్నేహ బంధం.. కొన్ని రోజులకు స్వలింగ సంపర్కానికి దారితీసింది. ఇటీవలే వారిద్దరిలో ఓ యువతి.. తన వేరే స్నేహితురాలితో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతోంది. దీంతో ఆ యువతిపై మరో యువతి కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే యువతిపై రేడియం కట్టర్​తో దాడి చేసింది. దీంతో ఆమె మెడ, చేతికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దాడి చేసిన యువతి.. తన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు వారిద్దర్నీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు యువతులు చికిత్స పొందుతున్నారు. స్వలింగ సంపర్కం నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని దావణగెరె ఎస్పీ సీబీ రిష్యంత్ తెలిపారు.

సెక్షన్ 307 కింద కేసు నమోదు: ఇద్దరు యువతులు చాలా ఏళ్లుగా స్నేహితులని, చాలా సన్నిహితంగా మెలిగారని ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఇటీవల వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం స్వలింగ సంపర్కంగా మారింది. అయితే ఇటీవల వారిలో ఒకరు (గాయపడినవారు) మరో యువతితో ఫోన్‌లో మాట్లాడుతూ సన్నిహితంగా మెలగడమే ఈ ఘటనకు ప్రధాన కారణం. దీంతో ఆగ్రహించిన యువతి తన స్నేహితుడిపై రేడియం కట్టర్‌తో దాడి చేసింది. యువతి మెడ, చెంప, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత యువతి చేయి కూడా కోసుకుని ఆత్మహత్యకు యత్నించిందని ఎస్పీ సీబీ రిష్యంత్‌ తెలిపారు. దాడికి గురైన యువతి చిక్కమగళూరు జిల్లా వాసి అని సమాచారం. ఆమెను అరెస్టు చేసి విద్యానగర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Next Story