ఏలూరులో దారుణం.. ప్రేమ పేరుతో యువతికి టార్చర్ చూపించిన యువ‌కుడు

Young man who tortures a Young woman in the name of love. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతికి టార్చర్ చూపించాడు అనుదీప్ అనే యువకుడు.

By M.S.R  Published on  23 April 2023 10:45 AM GMT
ఏలూరులో దారుణం.. ప్రేమ పేరుతో యువతికి టార్చర్ చూపించిన యువ‌కుడు

ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతికి టార్చర్ చూపించాడు అనుదీప్ అనే యువకుడు. ప్రేమ పేరుతో కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినిని వేధించాడు. ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్‌ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదు రోజుల క్రితం విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకుని వచ్చి చిత్రహింసలకు గురి చేశాడు. ఆమెను ఇంట్లోనే నిర్భంధించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. బలవంతం చేసేందుకు ప్రయత్నించడంతో యువతి ప్రతిఘటించడంతో వేడినూనె శరీరంపై పోసి టార్చర్‌ పెట్టాడు. ఆ యువతి ఆదివారం తెల్లవారుజామున ఎలాగోలా తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్రహింసలకు గురిచేసిన తర్వాత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అనుదీప్‌ పరారీలో ఉన్నాడు.




Next Story