దారుణం.. కోరిక తీర్చలేదని.. యువతిని కత్తెరతో పొడిచి చంపిన యువకుడు

Young man murders a woman for refusing affair with him in Srikakulam. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక కోరిక తీర్చాలంటూ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు

By అంజి  Published on  8 March 2022 2:53 PM IST
దారుణం.. కోరిక తీర్చలేదని.. యువతిని కత్తెరతో పొడిచి చంపిన యువకుడు

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక కోరిక తీర్చాలంటూ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమెను వేధించి, ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు. మృతుడి బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో మహేష్‌కి పరిచయం ఉంది. ఈ నెల 4న మహిళతో ఫోన్‌లో మాట్లాడిన మహేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడటంతో పాటు లైంగిక కోరికను తీర్చాలంటూ బలవంతం చేశాడు. అయితే అతడి కోరికను ఆమె నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన అతడు ఆమె మెడపై కత్తెరతో పొడిచాడు.

ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కేకలు వేసింది. ఊహించని ఈ ఘటనతో భయాందోళనకు గురైన మహేష్, మహిళ బతికి ఉంటే ప్రమాదమని భావించి, అదే కత్తెరతో విచక్షణారహితంగా వీపు, మెడపై పొడిచి చంపాడు. నిందితుడి చొక్కాపై రక్తపు మరకలు ఉండడంతో బాత్‌రూమ్‌లో స్నానం చేసి దుస్తులు ధరించి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. రాత్రి అయినా తలుపు తీయకపోవడంతో స్థానికులు మహిళ ఇంటికి వెళ్లారు. మృతుడి తల్లి గురుగుబెల్లి అమ్మడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్ రికార్డింగ్‌లు, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Next Story