జార్ఖండ్‌లో ఘోరం.. తానే ప్రేమికుడిన‌ని నిరూపించుకునేందుకు.. బాలిక‌పై అత్యాచారం

Young man molested girl in Jharkhand to prove she is his lover.బాలిక త‌న‌ను ప్రేమిస్తోంద‌ని స్నేహితుల ముందు నిరూపించేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2022 7:56 AM IST
జార్ఖండ్‌లో ఘోరం.. తానే ప్రేమికుడిన‌ని నిరూపించుకునేందుకు.. బాలిక‌పై అత్యాచారం

కొంద‌రు ఫ్రెండ్స్ ముందు గొప్ప‌లు చెప్పుకుంటారు. తాము అది చేశామ‌ని, ఇది చేశామ‌ని తెగ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతుంటారు. ఓ బాలిక విష‌యమై కొంద‌రు యువ‌కుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. త‌న‌ను బాలిక ప్రేమిస్తుందంటే కాదు త‌న‌ను ప్రేమిస్తుందంటూ వాగ్వాదానికి దిగ‌డంతో పాటు కొట్టుకున్నారు. చివ‌ర‌కు ఓ యువ‌కుడు ఆ బాలిక త‌న‌ను ప్రేమిస్తోంద‌ని స్నేహితుల ముందు నిరూపించేందుకు ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ట్రంలో జ‌రిగింది.

ఓ బాలిక విష‌యంలో ఇటీవ‌ల కోయలంచ‌ల్ ధ‌న్‌బాద్ ప్రాంతానికి చెందిన సంజ‌య్‌కి, అత‌డి స్నేహితుల‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆమె త‌న‌ను ప్రేమిస్తుంద‌ని యువ‌కుల్లో ఒక‌రు చెప్పారు. కాదు త‌న‌ని ప్రేమిస్తుంద‌ని మ‌రొక‌రు అన్నారు. కాదు త‌న‌నే ప్రేమిస్తుంద‌ని సంజ‌య్ చెప్పాడు. ఇలా మొద‌లైన మాట‌ల యుద్దం చివ‌ర‌కు కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు. చివ‌ర‌కు బాలిక త‌న‌ను ప్రేమిస్తుంద‌ని నిరూపిస్తాన‌ని స్నేహితుల ముందు సంజ‌య్ స‌వాల్ చేశాడు.

మ‌రుస‌టి రోజు బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పాడు. అనంత‌రం బాలిక‌ను పొద‌ల్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేకాదు ఈ దారుణాన్ని మొత్తం వీడియో తీసి స్నేహితుల‌కు పంపించాడు. స్నేహితుల్లో కొంద‌రు ఆ వీడియోను బాలిక బంధువ‌ల‌కు చూపించ‌డంతో విష‌యం వెలుగులోకి వచ్చింది. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సంజ‌య్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story