హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి కిందపడి ఓ కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..అల్వాల్ పీఎస్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురంలో ఓ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అయితే అక్కడ పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికుడు నర్సింహ ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు.
ఒక్క సారిగా కింద పడటంతో అతని తలకి తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. కార్మికుడు కిందపడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలో అక్కడే ఇటుకలు మోస్తున్న మరికొందరు మహిళా కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కార్మికుడు పైనుంచి కిందపడటంతో వారు షాక్‌కు గురయ్యారు. బిల్డింగ్ నిర్మాణంలో రక్షణ ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే కార్మికుడు కిందకి జారిపడినట్లు స్థానికులు చెబుతు న్నారు.