మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ స్థలంలో.. కుళ్లిపోయిన మహిళ మృతదేహం
మెట్రో స్టేషన్‌లోని పార్కింగ్ ఏరియాలో సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్న ఒక మహిళ కుళ్లిపోయిన మృతదేహాం లభ్యమైంది.
By అంజి Published on 28 Oct 2023 7:01 AM ISTమెట్రో స్టేషన్‌లో పార్కింగ్ స్థలంలో.. కుళ్లిపోయిన మహిళ మృతదేహం
ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్‌లోని పార్కింగ్ ఏరియాలో సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్న ఒక మహిళ కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహం మూడు, నాలుగు రోజుల క్రితం నాటిదని, బాగా కుళ్లిపోయిందని తెలుస్తోంది. జంగిల్ ప్రాంతానికి అనుసంధానించబడిన పార్కింగ్ స్థలంలో మృతదేహాన్ని బాటసారుడు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
"సిసిటివి కెమెరాలు, సమీపంలోని నివాసితుల సహాయంతో, ఎవరైనా పార్కింగ్ స్థలంలో విసిరివేసారా లేదా ఇది సహజ మరణమా అని నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ముంబైలోని వడాలాలో బ్యాగ్‌లో సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ముంబై పోర్ట్ ట్రస్ట్ సమీపంలో పోలీసు పెట్రోలింగ్ బృందం ఈ బ్యాగ్‌ను కనుగొన్నట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతకుముందు జూలైలో, ముంబైలోని వర్లీ ప్రాంతంలో గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ చేతులు, కాళ్లు విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వర్లీ సీ ఫేస్ వద్ద మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. కొందరు స్థానికులు సముద్రపు నీటిలో గన్నీ బ్యాగ్ తేలడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారని వర్లీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. మహిళను హత్య చేసి, మృతదేహాన్ని సముద్రంలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు.