ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం.. అత్యాచార అనుమానం

కాన్పూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  16 Jun 2024 6:31 AM IST
Crime, Kanpur hospital,  Uttarpradesh

ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం.. అత్యాచార అనుమానం

శనివారం కాన్పూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహిళ కింది భాగంలో బట్టలు లేకపోవడంతో అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. యాసిడ్ దాడి వల్ల ఆమె ముఖం కూడా వికృతంగా కనిపించింది. మహిళ మృతదేహాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో పడేశారు. ఉదయం ఆసుపత్రి వెనుక పొదల్లో మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పడేసినట్లు కాశీరామ్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ సుదేష్ గుప్తా తెలిపారు.

అతను మునుపటి రోజు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మృతదేహాన్ని కనుగొనలేదని, రాత్రిపూట నేరం జరిగిందని తెలిపాడు. లఖన్ సింగ్ యాదవ్ అనే పోలీసు అధికారి మాట్లాడుతూ.. మృతదేహం చాలా రోజుల నాటిదని, వేడి కారణంగా బాగా కుళ్ళిపోయిందని చెప్పారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష, పోస్ట్‌మార్టం కోసం పంపించామని, మహిళ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉందని తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

Next Story