Telangana: దారుణం.. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసిన తల్లి
భార్య భర్తల మధ్య జరిగిన గొడవ పిల్లల ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన నలుగురు పిల్లలను కాలువలో పడేసింది.
By అంజి Published on 17 Sept 2023 8:15 AM ISTTelangana: దారుణం.. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసిన తల్లి
భార్య భర్తల మధ్య జరిగిన గొడవ పిల్లల ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన నలుగురు పిల్లలను కాలువలో పడేసింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో చోటు చేసుకుంది. బిజినేపల్లి సమీపంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వలోకి ఓ తల్లి తన నలుగురు పిల్లలను తోసేసింది. ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా, నాలుగో బిడ్డ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగనూరు గ్రామానికి చెందిన సరబండ వాసురాం తండా నివాసి లలితను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.
పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శనివారం లలిత తన భర్త శరబండపై బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన లలిత తన నలుగురు పిల్లలతో కలిసి బిజినేపల్లి మండల కేంద్రం సమీపంలోని ఎంజీకేఎల్‌ఐ కాలువ వద్దకు వెళ్లింది. భర్తపై కోపంతో రగిలిపోయిన ఆమె తన పిల్లలను ఒకరి తర్వాత మరొకరిని నీటిలోకి విసిరివేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కూడా కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
మార్కండేయ మృతదేహం కనిపించలేదు. మహిళను రక్షించి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరగుతుండేదని పోలీసులు తెలిపారు. లలిత భర్త శరబంద మద్యం సేవించి వచ్చి అమ్మాయిల విషయంలో భార్యతో గొడవపడేవాడని, ఇవాళ కూడా మద్యం సేవించి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడని పోలీసులు వెల్లడించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.