హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్‌కు చెందిన ఓ మహిళను ఎస్‌ఆర్ నగర్‌లో ఆటో రిక్షా డ్రైవర్ కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఇటీవల అరెస్టు అయిన తన భర్తకు బెయిల్ లభించేలా సహాయం చేస్తానని నిందితుడు వాగ్దానం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మొహమ్మద్ జహంగీర్ బాధితురాలి భర్తకు స్నేహితుడు. బాధితురాలి భర్తను కలిసేందుకు తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆమె భర్త డ్రగ్స్‌ కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు.

అయితే "ఒక లాయర్‌ని ఏర్పాటు చేసి భర్తకు బెయిల్ తెచ్చిపెట్టడం ద్వారా ఆమెకు సహాయం చేస్తానని జహంగీర్ వాగ్దానం చేశాడు. ఆమె అతన్ని నమ్మింది."అని ఒక అధికారి తెలిపారు. ఆ తర్వాత జహంగీర్ ఆమెను అమీర్‌పేట్‌లోని ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. గదిలో బంధించి కత్తితో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలి కొడుకు నిందితుడు బెదిరించాడు.జహంగీర్ తనపై వేధింపులు కొనసాగించడంతో బాధితురాలు బాలానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాలానగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, కేసును బుధవారం అధికార పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌కు బదిలీ చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story