Video : మహిళను దారుణంగా కొడుతున్నా చూస్తూ ఉండిపోయారు.. వీడియోలు తీశారు

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పట్టపగలు కొందరు వ్యక్తులు ఒక మహిళను దారుణంగా కొట్టారు.

By Medi Samrat  Published on  22 Jun 2024 9:30 PM IST
Video : మహిళను దారుణంగా కొడుతున్నా చూస్తూ ఉండిపోయారు.. వీడియోలు తీశారు

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పట్టపగలు కొందరు వ్యక్తులు ఒక మహిళను దారుణంగా కొట్టారు. చుట్టుపక్కలవారు ఆ మహిళకు సహాయం చేయకుండా సినిమాను చూస్తునట్లు చూస్తూ ఉండిపోయారు. ఒక పురుషుల గుంపు మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టారు.

“గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని మేము కనుగొన్నాము. విచారణ చేస్తున్నాం” అని ధార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే ఈ వీడియోలో ఆమె దెబ్బలు తింటూ కేకలు వేస్తున్నప్పటికీ ఆమెను కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్లు కనీసం ముందుకు రాకపోవడం దారుణం.

Next Story