ఖమ్మంలో దారుణం.. కారులో ఎక్కించుకుని తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యం
Woman Teacher molested in Khammam.ఎన్నికఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 2:42 AM GMTఎన్నికఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. లిస్ట్ ఇస్తానంటూ నమ్మించి ఆపై బెదిరించి తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ కీచక ఉపాధ్యాయుడు. మంగళవారం రాత్రి ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్‌స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ రోజూ కారులో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. అదే మండలంలో పని చేస్తూ ఖమ్మంలో నివసించే ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తుంటుంది.
క్రమంలో ఈ నెల 17న పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్లో ఉపాధ్యాయురాలు వేచిఉంది. ఆమెను చూసిన కిశోర్.. డ్రాప్ చేస్తానని, తన భార్య కూడా వస్తోందని నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక.. ఉపాధ్యాయురాలిని బెదిరించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుకున్నాడు. అనంతరం పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి.. అక్కడ చంపుతాను అని బెదిరించి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఉపాధ్యాయురాలు విషయాన్ని ఎవరితోనే చెప్పలేదు. తనలో తానే కులిమిపోసాగింది. మంగళవారం తన భర్తకు విషయాన్ని చెప్పింది. ఇద్దరూ కలిసి ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కిశోర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.