దారుణం.. మహిళను నగ్నంగా ఊరేగించారు
కర్నాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 42 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి, ఊరేగించారు
By అంజి Published on 12 Dec 2023 4:15 AM GMTదారుణం.. మహిళను నగ్నంగా ఊరేగించారు
కర్నాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 42 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి, ఊరేగించారు. బాధితురాలి కుమారుడు ఒక యువతితో పారిపోయిన తర్వాత విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారని, దీనికి సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న బెళగావి నగరానికి 9 కిలోమీటర్ల దూరంలోని హోసా వంతమూరి గ్రామంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
బాధితురాలి 24 ఏళ్ల కుమారుడు 18 ఏళ్ల యువతితో ప్రేమ సంబంధం కలిగి ఉన్నాడు, కానీ ఆమె కుటుంబం మరొక వ్యక్తితో వివాహాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం జరగాల్సిన ఎంగేజ్‌మెంట్ వేడుకకు ముందే ఈ జంట పారిపోయారు అని ఓ పోలీసు అధికారి తెలిపారు. పారిపోయిన జంట ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. యువతి బంధువులు ఇంట్లో ప్రియుడి తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఆమెపై దాడి చేయడానికి ముందు వారు ఆమెను వివస్త్రగా ఊరేగించి, విద్యుత్ స్తంభానికి కట్టివేసినట్లు కాకతి పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం బెలగావి ఆస్పత్రికి తరలించారు.
హోంమంత్రి జి.పరమేశ్వర గ్రామాన్ని సందర్శించి ఇది అమానవీయ చర్య అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది అమానవీయ చర్య అని, సమాజానికి అవమానకరమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ''మా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను సహించదు. ఇప్పటికే ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత'' అని ఆయన అన్నారు. బెలగావి కమీషనర్ ఆఫ్ పోలీస్ SN సిద్దరామప్ప గ్రామాన్ని సందర్శించారు. అక్కడ కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసుల యొక్క రెండు ప్లాటూన్లను మోహరించారు.