దారుణం.. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన 13 మంది

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు 30 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దాడి చేశారు.

By అంజి  Published on  13 March 2023 12:15 PM IST
Uttar Pradesh, Crime news

దారుణం.. మహిళను వివస్త్రను చేసి 13 మంది దాడి చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో మానవత్వాన్ని మచ్చ తెచ్చే ఘటన వెలుగు చూసింది. ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు 30 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దాడి చేశారు. ఆగ్రాలోని థానా తాజ్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. గత వారం ఇద్దరు పురుషులు ఈవ్ టీజింగ్ చేయడంపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత ఆ ఇద్దరు మరో 11 మందితో కలిసి, కర్రలతో ఆయుధాలతో ఆమె ఇంట్లోకి చొరబడి, ఆమెను వివస్త్రను చేసి ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో బాధిత కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబాన్ని చంపేస్తానని కూడా నిందితులు బెదిరించారని యువతి తెలిపింది. అల్లర్లతో సహా వివిధ ఐపిసి సెక్షన్ల కింద 13 మంది నిందితులపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితులు పరారీలో ఉన్నారని ఎస్‌హెచ్‌వో రాజ్‌కుమార్‌ తెలిపారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్లాట్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళకు వేధింపులు

తాజ్‌గంజ్‌లోని లకావలి గ్రామానికి చెందిన ఓ మహిళ మార్చి 9 మధ్యాహ్నం తన ప్లాట్ నుండి ఇంటికి వెళ్తోంది. ఇంతలో ఇంటి బయట రఘువీర్, రాంనివాస్, జగదీష్, అనిల్ కుమారులు మోహన్ సింగ్, మహేష్, యోగేష్ తదితరులు మద్యం మత్తులో మహిళను వేధించారు. ఆమె ప్రతిఘటించడంతో నిందితులు ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి, బట్టలు చింపేసి వివస్త్రను చేశారు. నిందితులు బలవంతంగా ఆమెపై అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే , నిందితులు వారి దుస్తులను కూడా చింపివేసారు. కుటుంబంలోని ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. నిందితులు చంపేస్తామని బెదిరించారు. బాధితులకు వైద్యం అందించామని స్టేషన్‌ ఇన్‌చార్జి బహదూర్‌సింగ్‌ తెలిపారు.

Next Story