Medak: తల్లిని చంపిన కొడుకు.. ఇంటి బయటకొచ్చి కేకలు

మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హవేలి ఘన్‌పూర్ మండలం తొగిట గ్రామంలో గురువారం అర్థరాత్రి ఓ మహిళను ఆమె కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.

By అంజి  Published on  4 Aug 2023 12:45 PM IST
Medak, Crime news

Medak: తల్లిని చంపిన కొడుకు.. ఇంటి బయటకొచ్చి కేకలు

మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తు కోసం కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. హవేలి ఘన్‌పూర్ మండలం తొగిట గ్రామంలో గురువారం అర్థరాత్రి ఓ మహిళను ఆమె కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుస్తి నర్సమ్మ(45), ఆమె కుమారుడికి డబ్బుల విషయమై భాను ప్రకాష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో తల్లిని కత్తితో పొడిచి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి తల్లిని చంపేశానని కేకలు వేశాడు. నిందితుడు భానుప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తొగిట గ్రామానికి చెందిన పుస్తి నర్సమ్మ(45) వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు భాను ప్రసాద్, బాలు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భాను ప్రసాద్ తల్లిని అడిగాడు. అయితే తల్లి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. కోపంతో కుమారుడు భాను ప్రసాద్ తల్లిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న హవేలి ఘణపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. బాధితుడు మోతికే కృష్ణ(30) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. కృష్ణకు గ్రామంలోని ప్రత్యర్థులతో గొడవలు జరిగినట్లు సమాచారం. హత్యలో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు .

Next Story