ప్రైవేట్ పార్ట్స్‌లో దాచి రూ. కోటి విలువైన‌ బంగారం స్మ‌గ్లింగ్‌..!

Woman smuggling gold paste worth Rs 1 crore in private parts nabbed at Kozhikode airport. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా

By M.S.R  Published on  26 Dec 2022 4:42 PM IST
ప్రైవేట్ పార్ట్స్‌లో దాచి రూ. కోటి విలువైన‌ బంగారం స్మ‌గ్లింగ్‌..!

కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న 19 ఏళ్ల మహిళ ప్రయాణీకురాలిని కేరళ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాసర్‌గోడ్‌కు చెందిన షహలా, దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేసినట్లు వారు తెలిపారు.

స్మగ్లింగ్ గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న మలప్పురం పోలీసులు షహలాను అడ్డుకున్నారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల సెక్యూరిటీ చెక్ ను ముగించుకుని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన షహలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఆమె తన ప్రైవేట్ పార్ట్స్‌లో దాచుకున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం పోలీసులు ఈ కేసును కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.


Next Story