దళిత మహిళపై అత్యాచారం.. ఆపై కెమికల్‌తో దాడి చేసి తగులబెట్టాడు

రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బార్మర్‌లోని పచ్‌పద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం దళిత మహిళపై

By అంజి  Published on  9 April 2023 1:18 AM GMT
Rajasthan, Pachpadra police station, Crime news

దళిత మహిళపై అత్యాచారం.. ఆపై కెమికల్‌తో దాడి చేసి తగులబెట్టాడు

రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బార్మర్‌లోని పచ్‌పద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం దళిత మహిళపై అత్యాచారం చేసి, నిప్పంటించారని పోలీసులు తెలిపారు. 44 ఏళ్ల మహిళపై విసిరిన అత్యంత తాపజనక రసాయనం కారణంగా.. ఆమె 50 శాతం కాలిన గాయాలకు గురయ్యింది. మహిళను మొదట చికిత్స కోసం బలోత్రాలోని నహతా ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో జోధ్‌పూర్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

30 ఏళ్ల షకూర్ ఖాన్ తన ఇంట్లోకి చొరబడి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఘటన జరిగిన తర్వాత ఆ మహిళ తన గుర్తింపును బయటపెడుతుందని నిందితుడు భావించడంతో, నిందితుడు మహిళపై ఓ రకమైన కెమికల్‌ పోసి, నిప్పంటించి, అక్కడి నుంచి పారిపోయాడు. కాగా పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు వెనుకాడారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో దళిత సంఘాల సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

శుక్రవారం పోలీసులు భారతీయ శిక్షాస్మృతి, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి షకూర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story