నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. బాధితురాలిని ముద్నాల్ తండాకు చెందిన సవిత రాథోడ్ (35) అనే మహిళను గుర్తించారు. ఆమెకు కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు సచిన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఇది సామూహిక అత్యాచారం కేసుగా వారు భావిస్తున్నారు.
ఈ ఘటన సెప్టెంబర్ 9న కంచగరహళ్లి క్రాస్‌లోని తన పొలానికి వెళ్లిన సమయంలో జరిగింది. సవిత ఛాతీపై, చెవిపై కత్తిపోట్లు ఉండడంతో గ్రామస్తులు గుర్తించి వెంటనే కలబురగిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సవిత అనాథ అని, దివ్యాంగుడైన తన సోదరుడితో కలిసి జీవిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.