నిర్మల్‌లో దారుణం.. లివ్-ఇన్ పార్టనర్ చేతిలో మహిళ హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
నిర్మల్‌లో దారుణం.. లివ్-ఇన్ పార్టనర్ చేతిలో మహిళ హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విడాకులు తీసుకున్న మహిళను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేశాడు. ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా తిరుగుతోందని అనుమానించిన వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున భైంసా పట్టణంలో జరిగింది.
కుంసారా గ్రామానికి చెందిన అశ్విని (30) ను భైంసాకు చెందిన నాగేష్ కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ఆమె ఇద్దరు నిర్వహించే టీ స్టాల్ వద్ద రక్తపు మడుగులో కనిపించింది. గత కొన్ని రోజులుగా ఆమె మరొక వ్యక్తితో ఫోన్‌లో చాట్ చేస్తుండటంతో ఆమె విశ్వాసాన్ని అనుమానించానని, ఆమెను హత్య చేసినట్లు నాగేష్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
అశ్విని కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త నుండి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం నగేష్ తో కలిసి నివసిస్తోంది. కాగా ఈ జంట ఐదు నెలల క్రితం పట్టణంలో టీ స్టాల్ ఏర్పాటు చేశారు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు.