ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు.. భర్తను హత్య చేసిన భార్య

Woman kills husband for scolding not to talk on mobile for long hours. ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌లో ఓ మహిళ తన భర్త మెడకు ఉరివేసి హత్య చేసింది.

By అంజి  Published on  7 Sept 2022 1:09 PM IST
ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు.. భర్తను హత్య చేసిన భార్య

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. కలకాలం కలిసి ఉండాల్సిన భార్య, భర్తల మధ్య ఫోన్‌ చిచ్చుపెట్టింది. భార్య ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడం భర్తకు నచ్చేలేదు. ఈ విషయమై ఎన్నో సార్లు భార్యను మందలించాడు. అయితే భర్తను మాటను పక్కన పెట్టిన భార్య.. ఫోన్‌ మాట్లాడటం ఆపలేదు. ఫోన్‌ తెచ్చిన గొడవ భర్త ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌లో ఓ మహిళ తన భర్త మెడకు ఉరివేసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌కు చెందిన అజీమ్‌ఖాన్‌, శ్రావణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అజీమ్ కుటుంబం శ్రావణి తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఇటీవల శ్రావణి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. భార్య ఎక్కువ గంటలు మొబైల్‌లో మాట్లాడుతుండడంతో అజీమ్‌కు నచ్చలేదు. మొబైల్‌లో ఎక్కువ సమయం మాట్లాడకూడదని ఆమెను కోరాడు.

ఆమె తీరు మార్చుకోకపోవడంతో కాలనీ వాసుల ఎదుటే గొడ్డలితో శ్రావణి, అత్త నర్మదను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత ఇద్దరూ అజీమ్‌ని తమ ఇంట్లోకి లాగారు. ఆవేశంతో శ్రావణి భర్త గొంతు నులిమి చంపేసింది. ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అజీమ్ మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అజీమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story