మద్యం మత్తులో.. ఏడాది కుమార్తెను గొంతు నులిమి చంపిన తల్లి

Woman kills her one-year old daughter in Mangalhat. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

By అంజి  Published on  2 Feb 2022 7:34 AM GMT
మద్యం మత్తులో.. ఏడాది కుమార్తెను గొంతు నులిమి చంపిన తల్లి

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో తల్లులు, మద్యానికి బానిసలవుతున్న తండ్రులు.. చాలా మంది చిన్నారులను చిదిమేశారు. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాల్సిన తల్లిదండ్రులే దారుణాలకు తెగబడుతున్నారు. పిల్లలు అల్లరి చేస్తే.. తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. ఏడిస్తే దగ్గరకు తీసుకుని ఓదార్చుతారు. కానీ ఈ తల్లికి తన బిడ్డ బాధ అర్థం కాలేదు. హైదరాబాద్‌ నగర పరిధిలోని మంగళవారం రాత్రి మంగళ్‌హాట్‌లో ఓ మహిళ తన బిడ్డను మెడకు చున్నీ బిగించి హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్ దేవాలయం సమీపంలో నివాసముంటున్న లక్ష్మి (29) అనే మహిళ మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఏడాది వయసున్న తన కూతురిని పదే పదే కొట్టి, మెడపై నొక్కి చంపేసింది. "బిడ్డ బిగ్గరగా ఏడుస్తోందని, అందుకే ఆమెను కొట్టిందని ఆ మహిళ మాకు చెప్పింది. మహిళ మద్యం మత్తులో ఉంది" అని మంగళ్‌హాట్‌ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it