హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ హబ్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డీసీఎం వాహనం స్కూటీని ఢీకొట్టి, ఒక కిలోమీటర్ దూరం ఈడ్చుకువెళ్లడంతో హనియా అయేషా (22) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త అబ్దుల్ బాసిత్ (26) తీవ్రంగా గాయపడ్డారు. కేరళకు చెందిన ఈ దంపతులు కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరంలోని తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా మైండ్‌స్పేస్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత డ్రైవర్ పారిపోగా, స్థానికులు క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.