శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన భార్య.. రక్షించి మరీ చంపిన భర్త

శారీరక సాన్నిహిత్యం విషయంలో గొడవపడి భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు.

By అంజి
Published on : 19 April 2023 7:00 AM IST

Chhattisgarh, Crime news, Jashpur district

శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన భార్యను రక్షించి మరీ చంపిన భర్త

శారీరక సాన్నిహిత్యం విషయంలో గొడవపడి భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు. బావి నుండి ఆమెను రక్షించి.. కొన్ని క్షణాల తరువాత ఆమెను చంపేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శంకర్‌రామ్, అతని భార్య ఆశాబాయి ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నారు. దీంతో శంకర్ తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను కోరాడు. శంకర్‌తో శృంగారానికి ఆశా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

శారీరక సాన్నిహిత్యానికి సంబంధించిన గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే, ఆశా బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. భార్యను కాపాడేందుకు శంకర్ కూడా బావిలోకి దూకాడు. కాసేపటి తర్వాత ఆశాను కాపాడి బావిలో నుంచి బయటకు తీశాడు. శంకర్ ఆశను రక్షించి బావిలో నుంచి బయటకు తీయడంతో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన శంకర్ ఆశా ప్రైవేట్ భాగాలపై దాడి చేసి హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత రాత్రంతా భార్య మృతదేహం దగ్గరే కూర్చున్నాడు.

ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్టేషన్‌ ఇన్‌చార్జి గార్డెన్‌ జగ్సే పంక్రా తెలిపారు.

Next Story