5 ఏళ్ల బాలుడిపై మహిళ లైంగిక దాడి.. స్కూల్‌ బాత్రూమ్‌లో..

తమిళనాడులోని తంజావూరులో దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది.

By అంజి  Published on  20 March 2024 12:44 PM IST
assault, Tamilnadu,Thanjavur, Crime news

5 ఏళ్ల బాలుడిపై మహిళ లైంగిక దాడి.. స్కూల్‌ బాత్రూమ్‌లో..

తమిళనాడులోని తంజావూరులో దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. సదరు మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 19, మంగళవారం సాయంత్రం మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న మహిళ పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఐదేళ్ల బాలుడిని లైంగికంగా వేధించడంతో పాటు దుర్భాషలాడింది. బాలుడు అదే పాఠశాలలో నర్సరీ విభాగంలో చదువుతున్నాడు.

నిందితురాలు బాలుడిని మరుగుదొడ్డికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలుడిని బెదిరించింది. అయితే అదే స్కూల్‌లో చదువుతున్న అన్నయ్యతో ఆ బాలుడు తనకు ఎదురైన బాధను వివరించాడు. అనంతరం బాధితుడి అన్నయ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు వెంటనే కుంభకోణం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళను అరెస్టు చేసి, పోక్సో చట్టంతో పాటు ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story