పల్నాడులో మహిళ మృతి, శిశువు అదృశ్యం.. హత్య చేశారని అనుమానం!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం రాత్రి ఓ మహిళ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆమె ఏడు నెలల కుమారుడు అదృశ్యమయ్యాడు.

By -  అంజి
Published on : 6 Dec 2025 9:00 AM IST

Woman Found Dead, Infant Missing, Palnadu, Family Alleges Murder, Andhra Pradesh

పల్నాడులో మహిళ మృతి, శిశువు అదృశ్యం.. హత్య చేశారని అనుమానం!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం రాత్రి ఓ మహిళ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆమె ఏడు నెలల కుమారుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచెర్ల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ తన భార్య త్రివేణి (25), అనారోగ్యంతో ఉన్న వారి కుమారుడు శరత్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళుతుండగా. మల్లమ్మ సెంటర్ సమీపంలోని కాలువ ప్రాంతాన్ని దాటుతుండగా, ఒక బొలెరో వాహనం వారి దారికి అడ్డుగా ఉంది. వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్‌ అదుపు తప్పి కాలువలో పడిపోయింది. శ్రీకాంత్‌ ఎలాగోలా బయటపడగా.. త్రివేణి, వారి కుమారుడు కాలువలో పడిపోయారు.

శ్రీకాంత్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. త్రివేణి మృతదేహాన్ని కాలువ నుండి వెలికితీశారు, తప్పిపోయిన శిశువు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆ మహిళ కుటుంబం ఆమె హత్యకు గురైందని, ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించారని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, సమగ్రమైన, న్యాయమైన దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story