ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్..!
ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat
ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు బాధితురాలిపై ఎలాంటి అత్యాచారయత్నం జరగలేదని నిర్ధారణ అయ్యింది. ట్రైన్‌లో నుండి జారి కింద పడిన తనపై ఎలాంటి దాడి జరగలేదంటూ రైల్వే పోలీసుల ముందు బాధితురాలు ఒప్పుకోవడం తో రైల్వే పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును క్లోజ్ చేశారు.
MMTS ట్రైన్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ట్రైన్‌లో నుండి దూకిన యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసలు MMTS ట్రైన్‌లో యువతిపై అత్యా చారం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు. ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ యువతి ట్రైన్‌లో నుండి జారి కింద పడింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకూడదని భావించిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లుగా ఓ కట్టు కథ అల్లింది. ఆ కట్టు కథను నిజమని నమ్మిన పోలీసులు దాదాపు వందమంది అనుమానితులను విచారించారు. అంతేకాకుండా 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఎన్నో కోణాల నుండి దర్యాప్తు చేసినా యువతిపై అత్యాచారం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. చివరకు పోలీసులకు బాధితురాలిపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో అసలు విషయం ఒప్పు కుంది. రీల్స్ చేస్తున్న సమయంలోనే కాలు జారి ట్రైన్ నుండి జారి కింద పడిపోయినట్లుగా యువతి ఒప్పుకుంది. దీంతో రైల్వే పోలీసులు ఈ ఘటనపై లీగల్ ఒపీనియన్ తీసుకొని కేస్ క్లోజ్ చేశారు.