ఏప్రిల్ 12 న ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో చనిపోయిన, బట్టలు లేకుండా కనిపించిన మహిళ.. హత్యకు ముందు అత్యాచారానికి, దాడికి గురైనట్లు ఆమె శవపరీక్ష నివేదిక వెల్లడించింది. తలకు బలమైన గాయం, గొంతు నులిమి చంపడం వల్ల ఆమె చనిపోయిందని నివేదిక పేర్కొంది. శరీరం తల, ముఖం, ఛాతీ, గొంతు, ఆమె ప్రైవేట్ పార్ట్‌లకు 12 పెద్ద గాయాలు ఉన్నాయని, శవపరీక్షలో ఆమె శరీరం అంతటా అనేక సిగరెట్ కాలిన గాయాలు, కాటు గుర్తులు, గీతలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని బాబా కుటి దేవాలయం సమీపంలో ఏప్రిల్ 12న ఓ మహిళ అర్ధనగ్న మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. పోలీసులు మహిళను గుర్తించడానికి సోషల్ మీడియాలో ఆమె ఫోటోను పంచుకున్నారు. సమీపంలోని బందా, హమీర్‌పూర్, కాన్పూర్ దేహత్ జిల్లాలలోని నివాసితులను ప్రశ్నించారు.
ఏప్రిల్ 11వ తేదీ రాత్రి నల్లరంగు వాహనం బాబా కుటి ఆలయం సమీపంలోకి వచ్చి కాసేపటి తర్వాత వెళ్లిపోయిందని పలువురు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. వాహనంలో ఎలాంటి కార్యకలాపాలు కనిపించలేదని వారు తెలిపారు.