దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన భార్య.. కారణం ఇదే

Woman cuts husband's genitals after trivial fight in Rajasthan. రాజస్థాన్‌లోని బార్మర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త నిద్రపోతున్నప్పుడు అతని

By అంజి  Published on  17 Nov 2022 5:48 PM IST
దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన భార్య.. కారణం ఇదే

రాజస్థాన్‌లోని బార్మర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త నిద్రపోతున్నప్పుడు అతని ప్రైవేట్ భాగాలను నరికేసింది. రాత్రి పూట ఫోన్ మాట్లాడవద్దని చెప్పినందుకు భర్తపై భార్య కోపం పెంచుకుంది. అతడు నిద్రిస్తున్న సమయంలో భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన ధోరిమన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని భలిసర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిసర్‌కు చెందిన యువకుడికి 6 నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ సందర్భంగా బాధిత భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. కొంతకాలం క్రితం తాను రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో తన భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత భర్త నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రించిన తర్వాత, భార్య నిద్రిస్తున్న అతని ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసుకుంది. ప్రైవేట్ పార్ట్ తెగిపోవడంతో పెద్దగా కేకలు వేయడంతో అతని గొంతు విని ఇతర కుటుంబ సభ్యులు లేచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వరకట్న వేధింపుల కేసు

ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట.. అప్పటి నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. వీరిద్దరూ తరచూ గొడవపడేవారని విచారణలో తేలింది. గతంలో కూడా ఆమె అతనిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటన గురించి బార్మర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నర్పత్‌సింగ్ జైతావత్ మాట్లాడుతూ.. "బాధితుడి మెడికల్‌ రిపోర్ట్‌ కోసం వేచి చూస్తున్నామని, అది రాగానే చర్యలు తీసుకుంటాం" అని అన్నారు. ఇరువర్గాలను విచారిస్తున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Next Story