మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌.. పెళ్లి కాదేమోనన్న భయంతో..

పెళ్లి కాదేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని శాలిబండ

By అంజి  Published on  4 May 2023 7:45 AM IST
woman constable, suicide, Hyderabad, Crime news

మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌.. పెళ్లి కాదేమోనన్న భయంతో..

పెళ్లి కాదేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కూతురు డి.సురేఖ (28) ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె అలియాబాద్‌ కాల్వగడ్డ ఏడుగుళ్ల ప్రాంతంలో తన పేరెంట్స్‌, సిస్టర్‌తో కలిసి నివసిస్తోంది. 2018 బ్యాచ్‌కు చెందిన సురేఖ.. ఇటీవల భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ బదిలీ అయినా.. ఇంకా ఇక్కడి నుంచి రిలీవ్‌ కాలేదు. గతేడాది సురేఖకు పెళ్లి సంబంధం కుదిరినా.. పలు కారణాల వల్ల రద్దయ్యింది.

ఆ తర్వాత ఈ నెల 1వ తేదీన తన స్వగ్రామానికి చెందిన యువకుడితో సురేఖకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే ఆ యువకుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడని, జాతకాలు కూడా సరిగా మ్యాచ్‌ కాలేదని ఇరుకుటుంబాలు చర్చించుకోవడం మొదలైంది. దీంతో ఈ సంబంధం కూడా ఒకే కాదేమోనని సురేఖ మనస్తాపానికి గురైంది. ఈ నెల 2వ తేదీన ఉద్యోగానికి వెళ్లిన సురేఖ సోదరి.. ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండటం, ఫోన్‌ చేసిన లిఫ్ట్‌ చేయకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టారు. ఆ వెంటే ఇంట్లోకి వెళ్లి చూడగా సురేఖ.. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story