మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

Woman committed suicide by jumping from metro station. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి

By M.S.R  Published on  4 Jan 2023 12:21 PM IST
మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను మారెమ్మగా (70) గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ అని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మ ఆత్మహత్యకు ఆర్ధిక సమస్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story