మంచిర్యాలలో బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. మహిళపై కేసు నమోదు

మహారాష్ట్రకు చెందిన బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళపై ఆదివారం రాత్రి మంచిర్యాలలో కేసు నమోదైంది.

By అంజి  Published on  12 Feb 2024 6:32 AM GMT
Crime news, kidnap, Mancherial, Telangana

మంచిర్యాలలో బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. మహిళపై కేసు నమోదు

మహారాష్ట్రకు చెందిన బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళపై ఆదివారం రాత్రి మంచిర్యాలలో కేసు నమోదైంది. చంద్రాపూర్‌కు చెందిన మహేశ్‌ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కాసిపేట మండలానికి చెందిన సుమిత్రపై కిడ్నాప్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు మంచిర్యాల ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు. ఏసీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ ముందు రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటున్న మహేశ్‌ కుమార్తె ఆరేళ్ల అదితిని అపహరించేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆమెను పట్టుకున్నారు.

సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించి మంచిర్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చాక్లెట్ల ఆశ చూపి బాలికను ట్రాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల కదలికలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అపహరణదారులపై నిఘా పెంచాలని, నేరాలను నిరోధించాలని పోలీసులను అభ్యర్థించారు. పట్టణంలోని వీధుల్లో కిడ్నాపర్ల ముఠాలు, పురుషులు, మహిళలు రెచ్చిపోతున్నారని తెలిపారు.

Next Story