తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఓ మహిళ తన భర్తను కొట్టి చంపింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. భర్త 35 ఏళ్ల గుండ్ల సంపత్‌తో గొడవ జరగడంతో భార్య మంజుల కర్రతో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలు కావడంతో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన భర్తను ఓ మహిళ బండరాయితో మోదీ తల పగులగొట్టింది. నిందితురాలిని నసీమ్ బేగంగా గుర్తించారు. మృతుడు ముఖ్తార్ అహ్మద్ తన భార్యను అనుమానిస్తూ గొడవ లేవనెత్తాడు. విసుగు చెందిన మహిళ భర్తపై దాడి చేయడంతో మృతి చెందాడు.