ట్రాలీ బ్యాగ్‌తో వెళ్తున్న మహిళ.. అందులో ఉన్నది చూసి షాకైన పోలీసులు

Woman arrested while carrying lover’s body in suitcase in Ghaziabad. ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని తులసి నికేతన్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ తనతో కలిసి సహజీవనం

By అంజి  Published on  8 Aug 2022 8:08 PM IST
ట్రాలీ బ్యాగ్‌తో వెళ్తున్న మహిళ.. అందులో ఉన్నది చూసి షాకైన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని తులసి నికేతన్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ తనతో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో దాచి పారవేసేందుకు ప్రయత్నించింది. 35 ఏళ్ల ఆ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను ప్రీతి శర్మగా పోలీసులు గుర్తించారు. మృతుడిని మహ్మద్‌ ఫిరోజ్‌ (22)గా గుర్తించారు. శనివారం రాత్రి ఇద్దరూ పెళ్లి విషయమై గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే రేజర్‌ బ్లేడ్‌తో ఆ మహిళ తన ప్రియుడి గొంతు కోసింది. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 24 గంటల పాటు ఫ్లాట్‌లోనే దాచిపెట్టింది.

ఫిరోజ్‌ ఢిల్లీలోని ఓ సెలూన్‌లో షాపులో పని చేసేవాడని పోలీసులు చెప్పారు. ప్రీతి, ఫిరోజ్ గత నాలుగేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లి విషయంలో నిత్యం గొడవ పడేవారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ట్రాలీ సుట్‌కేసులో పెట్టి.. పారవేసేందుకు ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రీతి తన ఫ్లాట్ బయట ఆటో కోసం ఎదురుచూస్తుండగా అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు. ప్రీతి పోలీసులను చూసి భయపడిపోయింది. దాని కారణంగా వారికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు ఆరా తీశారు. బ్యాగులో ఏముందో చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

దీంతో భయపడిన ప్రీతి పోలీసుల ముందు జరిగినదంతా ఒప్పుకుంది. శనివారం రాత్రి పెళ్లి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని ప్రీతి పోలీసులకు తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ యాదవ్ అనే వ్యక్తితో ప్రీతికి వివాహమైంది. కానీ గొడవల తర్వాత, ప్రీతి తన భర్తను విడిచిపెట్టి దాదాపు 4 సంవత్సరాలు ఫిరోజ్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఫిరోజ్ సంభాల్ నివాసి. ఇద్దరూ తులసి నికేతన్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసించారు. మృతుని కుటుంబీకులకు సమాచారం అందించామని, ఆ మహిళను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా త్వరలో సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story