మహిళా కానిస్టేబుల్ విధులకు హాజరుకాలేదు.. అనుమానంతో రాత్రి పోలీస్ క్వార్టర్స్‌కి వచ్చి చూడగా..

Woman AR constable dies by suicide in Vellore. వేలూరు ఏఆర్‌కి అటాచ్ అయిన మహిళా కానిస్టేబుల్ శుక్రవారం రాత్రి వేలూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో

By అంజి  Published on  27 Feb 2022 9:41 AM IST
మహిళా కానిస్టేబుల్ విధులకు హాజరుకాలేదు.. అనుమానంతో రాత్రి పోలీస్ క్వార్టర్స్‌కి వచ్చి చూడగా..

వేలూరు ఏఆర్‌కి అటాచ్ అయిన మహిళా కానిస్టేబుల్ శుక్రవారం రాత్రి వేలూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఇందుమతి (26)గా గుర్తించారు. ఆమెకు 2010లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి క్రిష్ణమూర్తితో వివాహమైంది. ఇద్దరు పిల్లల ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారి పిల్లలు ఇడయంబట్టులోని క్రిష్ణమూర్తి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. శుక్రవారం ఇందుమతి విధులకు హాజరుకాలేదు. దీంతో తోటి కానిస్టేబుళ్లు అనుమానం వ్యక్తం చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

రాత్రి పోలీస్‌ క్వార్టర్స్‌కి వచ్చి చూడగా ఇందుమతి ఉరివేసుకుని కనిపించింది. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఏఆర్ క్వార్టర్స్‌లో ఉరివేసుకుని చనిపోవడంతో, వేలూరు సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మృతదేహం దగ్గర పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసున్నారు.

ఇదిలా ఉంటే.. మరో ఘటనలో కుటుంబ వివాదంతో పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ వేలుసామి లోతైన గుంటలో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. అతడు గుంటలో దూకి చనిపోయాడని పోలీసులు తెలిపారు.

Next Story