పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. రాజేంద్రనగర్‌ పోలీసులను ఆశ్రయించిన మహిళ

Woman approaches rajendranagar cops alleging rape by man who promised marriage. హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మహిళపై .

By అంజి  Published on  18 Jan 2022 9:13 AM GMT
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. రాజేంద్రనగర్‌ పోలీసులను ఆశ్రయించిన మహిళ

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అత్యాచారం చేశాడని మహిళ రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల యువతి అదే పొరుగు ప్రాంతానికి చెందిన నిందితుడు దుర్గా వరప్రసాద్ (26)తో స్నేహం చేసింది. అతను ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె అంగీకరించింది. అప్పటి నుండి, వారు చాలా సందర్భాలలో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఇటీవల ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. నిందితుడు దుర్గా వరప్రసాద్ ఆమె నుండి తప్పించుకోవడం ప్రారంభించాడు. ఆమెను బెదిరించడమే కాకుండా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక మరో ఘటనలో పాట్నాలోని ఓ సర్కిల్ ఆఫీసర్‌పై అత్యాచార ఆరోపణల కింద కేసు నమోదైంది. గత నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నాలుగేళ్ల క్రితం సర్కిల్‌ ఆఫీసర్‌ రఘువీర్‌ ప్రసాద్‌ బెట్టియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడిందని మహిళ తెలిపింది. "ప్రసాద్ మొదట్లో తండ్రిలా నాకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత నాతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు" అని బాధితురాలు తెలిపింది. తాను వద్దని తెలిపినప్పుడు తన పరువు తీస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి పెళ్లి సాకుతో ఆమెతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నాడు బాధితురాలు చెప్పింది.

Next Story
Share it