దారుణం.. వివ‌స్త్ర‌ను చేసి.. ఊరేగించి

Woman and her lover paraded naked by villagers.జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం

By అంజి  Published on  30 Sep 2021 4:34 AM GMT
దారుణం.. వివ‌స్త్ర‌ను చేసి.. ఊరేగించి

జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారన్న నెపంతో ఓ మహిళ, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు ఆ గ్రామ ప్రజలు. డుమ్కా జిల్లా బడ్తల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వివాహిత మహిళను, ఆమె ప్రేమికుడిని వివస్త్రగా చేసి గ్రామంలో ఒక కిలోమీటరు మేర నగ్నంగా ఊరేగించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత భర్త నేరం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆమె దగ్గర్లోని పట్టణంలో రోజు వారీ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెతో పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఆ యువకుడు ఆ వివాహిత ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు.. వారిని పట్టుకుని బంధించారు. వివాహితను, యువకుడిని వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వారికి రక్షణ కల్పించారు. ఈ ఘటనలో పాల్గొన్న సుమారు 60 మందిపై కేసులు నమోదు చేశారు. గత ఆగస్టు నెలలో సైతం ఇలాంటి దారుణ ఘటనే డుమ్కా జిల్లాల్లో చోటు చేసుకుంది. పురుషుడితో వివాహేతరం సంబంధం ఉందని ఆరోపిస్తూ ఓ మహిళను వివస్త్రను చేసి, మెడలో బూట్ల దండతో నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన రాణీశ్వర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆ మహిళను అవమానించినందుకుగాను ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Next Story
Share it