ఖాళీ రైలు పెట్టెలో మహిళపై అత్యాచారం

ముంబైలోని బాంద్రా స్టేషన్‌లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్‌ను అరెస్టు చేశారు.

By M.S.R  Published on  3 Feb 2025 4:33 PM IST
ఖాళీ రైలు పెట్టెలో మహిళపై అత్యాచారం

ముంబైలోని బాంద్రా స్టేషన్‌లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్‌ను అరెస్టు చేశారు. శనివారం రాత్రి మహిళ, ఆమె కుమారుడు అవుట్‌స్టేషన్ రైలులో స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

రైలు దిగిన తర్వాత, తల్లీ కొడుకులు ప్లాట్‌ఫారమ్‌కు అవతలి వైపు ఉన్న మరో రైలులోకి ప్రవేశించారని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో వీరు ఎక్కిన రైలులో ప్రయాణికులు లేరని, పోర్టర్ మాత్రమే ఉన్నాడని అధికారి తెలిపారు. ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయని అధికారులు తెలిపారు. బాంద్రా రైల్వే పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేయడంతో పోర్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకుంది.

పోలీసులు విచారణ ప్రారంభించి ప్లాట్‌ఫారమ్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మొదటి రైలు నుండి దిగిన తర్వాత మహిళ, ఆమె కుమారుడు రెండవ రైలులోకి ఎందుకు ప్రవేశించారనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Next Story