Hyderabad: దారుణం.. భార్యను చంపి, డెడ్‌బాడీని సంచిలో చుట్టి..

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.

By అంజి  Published on  12 July 2024 4:30 PM IST
murder, Uppal, Hyderabad, Crime

Hyderabad: భార్యను చంపి, డెడ్‌బాడీని సంచిలో చుట్టి..

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య మధుస్మితను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో చుట్టి బాత్ రూంలో పెట్టి అక్కడి నుండి పారిపోయాడు. దుర్వాసన వస్తుండటంతో ఏదో చనిపోయి ఉంటుందని బిల్డింగ్ లోని మిగతా ఫ్యామిలీస్ భావించారు. నిన్న అర్ధరాత్రి నుంచి భరించలేని దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్ళు ఇంటి ఓనర్‌కి సమాచారం ఇచ్చారు. ఓనర్ తలుపు బద్దలు కొట్టి చూడగా బాత్ రూంలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

సంచిలో చుట్టి.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉంది. భర్త ప్రదీప్ భోలే.. భార్య మధుస్మితను హత్య చేసి పాపను తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. ప్రదీప్ భోలే కోసం గాలిస్తున్నారు.

Next Story