రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సోమవారం ఒక పార్టీలో కలిసిన వ్యక్తి ఒక ఫ్రెంచ్ పర్యాటకురాలిని అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం.. ఆ మహిళ జూన్ 22న ఢిల్లీ నుండి ఉదయపూర్ చేరుకుని నగరంలోని అంబమాత ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేసింది. సోమవారం రాత్రి, ఆమె టైగర్ హిల్ సమీపంలోని ది గ్రీక్ ఫార్మ్ కేఫ్ అండ్ రెస్ట్రోలో ఒక పార్టీకి హాజరైంది, అక్కడ ఆమె నిందితుడిని కలిసింది.
అక్కడ పార్టీ జరుగుతున్న సమయంలో, ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి, “మనం బయటకు సిగరెట్ తాగడానికి వెళ్దాం, చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను చూపిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత ఆ నెపంతో ఆమెను వేదిక నుండి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన హోటల్‌కు తిరిగి వెళ్లాలని పదేపదే కోరినప్పటికీ, ఆ వ్యక్తి ఆమెను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. ఆమె ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో ఆమె సహాయం కోసం కాల్ చేయలేకపోయింది.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఫ్లాట్ లోపలికి వెళ్ళిన తర్వాత, నిందితుడు ఆమెను కౌగిలించుకోమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఆ ఫ్రెంచ్ మహిళ తరువాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అక్కడ సిబ్బంది ఈ దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె స్వయంగా ఆసుపత్రి నుండి ఫిర్యాదు చేసిందని తెలిపారు. "నిందితుడు పర్యాటకురాలితో కలిసి కేఫ్‌లో గడిపి, ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి సందర్శన సాకుతో ఘాటుగా ప్రవర్తించాడు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.