భర్త ముక్కుపై గుద్ది చంపిన భార్య

భర్త పుట్టినరోజుకు దుబాయ్‌కి తీసుకుని వెళ్లలేదని భర్తను చంపేసింది ఓ మహిళ.

By Medi Samrat  Published on  25 Nov 2023 3:51 PM IST
భర్త ముక్కుపై గుద్ది చంపిన భార్య

భర్త పుట్టినరోజుకు దుబాయ్‌కి తీసుకుని వెళ్లలేదని భర్తను చంపేసింది ఓ మహిళ. పుణెలోని వనవ్డి ప్రాంతంలో నిఖిల్ ఖన్నా (36) అనే నిర్మాణ రంగ వ్యాపారవేత్త తన భార్య రేణుకతో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరూ ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. రేణుక బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం నిఖిల్ దుబాయ్ తీసుకెళ్లలేదు. అంతేకాకుండా ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా గొడవగా మారిపోయింది. కోపంతో ఊగిపోయిన రేణుక నిఖిల్ ముఖంపై గుద్దింది. దీంతో నిఖిల్ ముక్కు, కొన్ని దంతాలు విరిగిపోయాయి. అనంతరం తీవ్ర రక్తస్రావంతో నిఖిల్ మరణించాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని రేణుకపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.

దంపతుల మధ్య శుక్రవారం గొడవ జరగ్గా విచక్షణ కోల్పోయిన రేణుక భర్త ముక్కుపై బలంగా గుద్దింది. ఆ దెబ్బలకు నిఖిల్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటూ పళ్లు కూడా ఊడిపోయాయి.

Next Story