భర్తను చంపి 50 మీటర్ల లోతులో పాతిపెట్టిన భార్య.. దృశ్యం-2 సినిమా స్టైల్లో సాక్ష్యాల ధ్వంసం
Wife murdered husband along with her lover in karnataka. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది.
By అంజి Published on 1 Dec 2022 2:50 PM ISTవివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. అంతే కాకుండా సినిమా స్టైల్లో సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన ఘటన బెంగళూరులోని సోలదేవనహళ్లిలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి షాకయ్యారు. దృశ్యం-2 సినిమాను ఈ హత్య తలపిస్తోంది.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది
భర్త దేశేగౌడను ప్రియుడితో కలిసి భార్య జయలక్ష్మి గొంతు కోసి చంపేసింది. తర్వాత సాక్షులు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా నిర్జన ప్రదేశంలో విసిరేసింది. దేశేగౌడ మృతదేహాన్ని సోలదేవనహళ్లి ఫాంహౌస్ నుంచి కారులో తీసుకెళ్లారు. మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. 35 ఏళ్ల జయకు 16 ఏళ్ల క్రితం దేశేగౌడతో వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులిద్దరూ ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నారు. అయితే భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే జయకు రాజేష్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో దేశేగౌడ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధంపై భర్త దేశేగౌడకు అనుమానం వచ్చింది. ఇదే విషయమై దేశేగౌడ ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
ప్లాన్ ప్రకారం.. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించి ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి హత్య చేశాడు. అనంతరం కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు. కారులో మృతదేహాన్ని రామనగర వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న కాలువలో మృత దేహాన్ని 50 మీటర్ల లోతులో పాతిపెట్టారు. మృతుడి ఫోన్‌ను నిర్జన ప్రదేశంలో పడేశారు. తర్వాత రోజు తనకు ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో నిజం తెలిసింది. భార్య, తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని పోలీసులు నిర్దారించారు. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో దేశేగౌడ మృతదేహం లభ్యమైంది.