Hyderabad: ప్రియుడిపై మోజుతో.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను చంపి పూడ్చి పెడ్డింది.

By అంజి
Published on : 21 April 2025 1:30 PM IST

Wife kills husban, lover, Hyderabad, Crime

Hyderabad: ప్రియుడిపై మోజుతో.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను చంపి పూడ్చి పెడ్డింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సాయిలు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయిలు, కవిత దంపతులు. గత వారం రోజుల క్రితం సాయిలు, కవిత హైదరాబాద్ నగరానికి వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. కవితకు హైదరాబాద్‌కు రాకముందే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ వచ్చిన నాటి నుండి అతన్ని విడిచి ఉండ లేకపోయింది. దీంతో భర్తపై విరక్తి చెందిన కవిత ఎలాగైనా సరే భర్త సాయిలుని అంత మొందించాలని అనుకుంది. దీని కోసం చెల్లెలు, ఆమె భర్త సహాయం కోరింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కవిత , ఆమె చెల్లెలు, చెల్లెలి భర్త ఈ ముగ్గురు కలిసి సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపారు. సాయిలును చంపేసిన అనంతరం ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మృతదేహాన్ని నివాసానికి సమీపంలో పూడ్చిపెట్టి అక్కడి నుండి పారిపోయారు. కవిత తన స్వగ్రామమైన పాత లింగయ్య పల్లికి వచ్చి.. గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు తన భర్త సాయిలు ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదని చెప్తూ కన్నీరు పెట్టుకుంది.

అది నిజమని గ్రామస్తులందరూ నమ్మారు.. కానీ భర్తను చంపిన అనంతరం భార్య కవిత, ఆమె చెల్లెలు, చెల్లెలి భర్త ఈ ముగ్గురు నిందితులు ఆటోలో పాత సామాన్లు ఉన్నాయంటూ కెపిహెచ్బి నుండి సంగారెడ్డికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్‌కు అనుమానం రావడంతో తిరిగి తీసుకొచ్చి హైదరాబాదులో వదిలేసి... నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కెపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని కవితను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య ఉదాంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు.

Next Story