భార్య ప్రియుడితో పారిపోయిందని.. మామను కాల్చి చంపిన భర్త

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో పారిపోయిందని ఓ వ్యక్తి

By అంజి
Published on : 30 March 2023 3:13 PM IST

Maharashtra, Jalna, Crime news, Wife elopes with lover

భార్య ప్రియుడితో పారిపోయిందని.. మామను కాల్చి చంపిన భర్త

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో పారిపోయిందని ఓ వ్యక్తి తన మామను కాల్చిచంపాడు. ఈ ఘటనను జిల్లాలో ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. ఈ సంఘటన బుధవారం అంబాద్‌లోని శారదా నగర్‌లో జరిగింది. నిందితుడు పైఠాన్‌లోని అడూల్‌లో నివాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి భార్య తన ప్రియుడితో పారిపోయి ఔరంగాబాద్‌కు వెళ్లింది. ఆ తర్వాత భర్త.. శారదానగర్‌లో ఉంటున్న తన మామకు ఇంటికి వెళ్లాడు.

అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైన నిందితుడు తన మామతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆవేశంతో భర్త తన మామని కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇన్‌స్పెక్టర్ శిరీష్ హుంబే చెప్పారు.

Next Story