ఆ వీడియోలు చూపిస్తూ వేధింపులు.. పక్కా ప్లాన్‌తో.. భర్తను చంపిన భార్య

Wife Assassinated Husband Over Illegal Affair In Warangal. పరాయి మహిళలతో కలిసి ఉన్న వీడియోలను భార్యకు చూపిస్తూ పైశాచిక ఆనందంగా పొందాడు భర్త.

By అంజి  Published on  19 Dec 2022 12:01 PM IST
ఆ వీడియోలు చూపిస్తూ వేధింపులు.. పక్కా ప్లాన్‌తో.. భర్తను చంపిన భార్య

పరాయి మహిళలతో కలిసి ఉన్న వీడియోలను భార్యకు చూపిస్తూ పైశాచిక ఆనందంగా పొందాడు భర్త. దీంతో ఇతర మహిళలతో భర్త సన్నిహితంగా ఉండటం ఆ భార్య చూడలేపోయింది. అప్పటికే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎదో పోనీలే అని వదిలి పెట్టింది. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులు భరించలేకను భర్తను భార్య చంపేసింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భర్త వేణుకుమార్‌ను.. తన బంధువుతో కలిసి భార్య సుస్మిత చంపించేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. రెండు రోజులకు ఒకసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన భార్య ఆచూకీ ఎక్కడా అంటూ పోలీసులను నిలదీసేది. దీంతో పోలీసులకు భార్యపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమె కాల్‌డేటాను పరిశీలించారు. వివాహేతర సంబంధాల కారణంతో భర్తను భార్యను అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు.

మొబైల్‌ సిగ్నల్స్‌, కాల్‌ డేటా ఆధారంగా 71 రోజుల తర్వాత హత్య కేసును పోలీసు ఛేదించారు. భర్త వేణు కుమార్‌ను చంపేందుకు సుస్మిత్‌.. మరో ముగ్గురితో కలిసి ప్రణాళిక రూపొందించింది. భర్తను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడింది. రూ.4 లక్షల బేరం మాట్లాడుకుని.. రూ.2 లక్షలు సుపారీ గ్యాంగ్‌కు ఇచ్చింది. ప్లాన్‌ ప్రకారం.. గత సెప్టెంబర్‌ 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపి భర్త వేణుకుమార్‌కు తాగించింది. అతడు నిద్రలోకి జారుకోగాగానే గడ్డం రత్నాకర్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేశాడు.

వేణుకుమార్‌ని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని రత్నాకర్‌ వెళ్లిపోయాడు. మార్గం మధ్యలో నవీన్‌ అనే వ్యక్తికి కారులో ఎక్కించుకున్నాడు. మంథినికి వెళ్లిన తర్వాత వేణుకుమార్‌ను బట్టలు విప్పి మానేరు అతడిని నదిలో పడేశారు. దీంతో వేణుకుమార్‌ నిద్ర మత్తులో మునిగిపోయి మృతి చెందాడు. అక్టోబర్ 3వ తేదీన వేణుకుమార్ మృతదేహం పోలీసులకు దొరికింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం సుస్మితాదేవి తన భర్త కనిపించడం లేదని అక్టోబర్ 7న కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చివరికి పోలీసులకు అసలు విషయం తెలియడంతో మృతుడి భార్యను, ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story