దారుణం.. భ‌ర్త పురుషాంగం కోసి హ‌త్య చేసిన భార్య‌

Wife assassinated Husband in East Godavari District.తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మ‌ద్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 5:59 AM GMT
దారుణం.. భ‌ర్త పురుషాంగం కోసి హ‌త్య చేసిన భార్య‌

తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోయిన భార్య‌.. భ‌ర్త‌ను అతికిరాత‌కంగా హ‌త్య చేసింది. వివ‌రాల్లోకి వెళితే సీతాన‌గ‌రం మండ‌లం రఘుదేవపురం గ్రామంలో అబ్బులు(46), ముత్యాలు దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి మ‌ద్యం తాగే అల‌వాటు ఉంది. ఈ క్ర‌మంలో మ‌ద్యం తాగి ఇద్ద‌రు బుధ‌వారం రాత్రి గొడవ ప‌డి ఇంటికి వెళ్లిపోయారు. తెల్ల‌వారుజామున ముత్యాలు ఒక్క‌తే ఇంటికి వ‌చ్చింది.

రాపాక గ్రామ శివారు క‌ల్వ‌ర్టు వ‌ద్ద మృత‌దేహం ఉంద‌ని పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లారు. మృతుడిని అబ్బులుగా గుర్తించారు. త‌న భ‌ర్త మూర్చ‌వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణించాడ‌ని భార్య అంద‌రిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. మృత‌దేహంపై గాయాలు ఉండ‌డం, పురుషాంగం కూడా కోసేసి ఉండ‌డంతో పోలీసులు హ‌త్యేన‌ని నిర్థారించిన పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి భార్య ముత్యాలును అదుపులోకి తీసుకుని విచారించ‌గా..తానే ఈ హ‌త్య‌ను చేసిన‌ట్లు నేరాన్ని అంగీక‌రించింది.

Next Story
Share it