భ‌ర్త‌తో సంబంధం పెట్టుకుంద‌ని.. మ‌హిళ‌ను చంపిన భార్య‌.. ప‌ట్టించిన సీసీ కెమెరా

Wife assassinated a women over husband extramarital affair.త‌న భ‌ర్త‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 9:27 AM GMT
భ‌ర్త‌తో సంబంధం పెట్టుకుంద‌ని.. మ‌హిళ‌ను చంపిన భార్య‌.. ప‌ట్టించిన సీసీ కెమెరా

త‌న భ‌ర్త‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని, స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ గొంతు కోసీ, రోక‌లిబండ‌తో త‌ల‌పై మోది హ‌త్య చేసింది ఓ భార్య‌. ఈ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లోని రాణిగారితోట‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రాణిగారితోటలోని విద్యుత్‌ కార్యాలయం సమీపంలో రౌతు సత్య (36), భర్త, కుమార్తెతో క‌లిసి నివ‌స్తోంది. భర్త కన్‌స్ట్రక్షన్‌ కార్మికుడిగా పనిచేస్తుండగా.. సత్య పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వ‌ర్తిస్తోంది. వీరి ఇంటికి స‌మీపంలో ఉండే ఆదినారాయ‌ణ వ్య‌క్తితో స‌త్య‌కు ఏర్పడిన ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. విష‌యం తెలిసిన స‌త్య భ‌ర్త‌.. ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవాల‌ని ప‌లుమార్లు సత్య‌ను మంద‌లించాడు.

అయిన‌ప్ప‌టికీ స‌త్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాక‌పోవ‌డంతో అత‌డు విసిగిపోయిన అత‌డు.. 20 రోజుల క్రితం ఇళ్లు వ‌దిలి వెళ్లిపోయాడు. ఇక స‌త్య విష‌యంపై ఆదినారాయ‌ణ కుటుంబంలో కూడా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌త వారం ఆదినారాయ‌ణ..స‌త్య ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి ల‌క్కీ బార్ ప‌క్క వీధిలోకి మ‌కాంను మార్పించాడు. అప్ప‌టి నుంచి నిత్యం ఇంటికి క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌చ్చి వెలుతుండేవాడు. గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌టికి వెళ్లిన స‌త్య కుమారై.. రాత్రి ఇంటికి వ‌చ్చింది. ఇంటి లో ప‌ల త‌ల్లి కత్తిపోట్ల‌కు గురై అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్లు గుర్తించి కేక‌లు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్క‌డికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వ‌చ్చి.. చ‌నిపోయిన‌ట్లుగా నిర్థారించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మృతురాలి గొంతు కోసినట్లు ఉండటం, తలపై గాయాలుండటంతో ఎవ‌రైనా హంత‌కులు ఈ హ‌త్య చేసి ఉంటారేమోన‌ని తొలుత పోలీసులు బావించారు. అనంత‌రం లక్కీబార్‌ సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఆదినారాయణ భార్య మళ్లీశ్వరి చేతులో క్యారీబ్యాగ్‌తో బార్‌ పక్క వీధిలోకి వెళ్లినట్లు క‌నిపించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుక‌ని ప్ర‌శ్నించ‌గా.. స‌త్య‌ను తానే హ‌త్య చేసిన‌ట్లు ఒప్ప‌కుంది. బ్లేడుతో సత్య గొంతు కోసం ఆపై రోకలిబండతో తలపై కొట్టినట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించింది.

Next Story
Share it