కామా తురానాం నభయం నలజ్జ.. అన్నట్టుగా కొంత మంది కామాంధులు చేస్తున్న పనుల వల్ల సభ్య సమాజం తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ కంపెనీ యజమాని చేసిన దిక్కుమాలిన పని చివరికి కట కటాల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. పల్లివాలి ప్రాంతానికి చెందిన సంజు అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా ZThree Infotech పేరుతో వెబ్ డిజైనింగ్ సంస్థను నడుపుతున్నాడు. ఈ మద్యనే తన సంస్థ కార్యకలాపాలను నాగర్‌కోయిల్ ప్రాంతంలోకి కొత్త ఆఫీస్‌కు షిఫ్ట్ చేశాడు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలను కొత్తగా అపాయింట్ మెంట్ చేసుకున్నాడు.
ఉద్యోగుల సౌకర్యం కోసం లేడీస్, జెంట్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ మహిళ ఆఫీసులోని టాయిలెట్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఏదో తేడాగా కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని టాయిలెట్ అంతా పరిశీలనగా చూసింది. ఆమెకు ఓ నల్లని కవర్ లాంటిది కనిపించింది.. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో సీసీటీవీ కెమెరా కనిపించింది. దాంతో ఒక్కసారే షాక్ తిన్నది.. తాను చూడకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మెల్లిగా అక్కడ నుంచి బయటకు వచ్చింది.
కంపెనీ యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా సాయంత్రం వరకు ఏమీ జరగనట్టే ఉంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆఫీసుకు వచ్చి టాయ్ టెల్స్ లో ఉన్న సీసీ కెమెరాను చూసి సంజుని ప్రశ్నించారు. దానికి సంజు డొంకతెరుగుడు సమాధానాలు చెప్పడంతో అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.