Vizianagaram: ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై డీఎస్పీ డ్రైవర్ అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
విజయనగరం జిల్లాలో ఓ మహిళపై తన ప్రియుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jun 2024 10:00 AM ISTVizianagaram: ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై డీఎస్పీ డ్రైవర్ అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
విజయనగరం జిల్లాలో ఓ మహిళపై తన ప్రియుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి సహకరించిన అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. రాజు కుమార్‌గా గుర్తించబడిన హోంగార్డు శ్రీకాకుళం జిల్లా పోలీసులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటన మే 25న జరిగినప్పటికీ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో మే 31న వెలుగులోకి వచ్చింది. మే 25న ఒంటరి ప్రదేశంలో ఉన్న మహిళ, ఆమె స్నేహితుడిని గమనించిన రాజు కుమార్ ఆ జంటను బెదిరించాడు. కౌన్సెలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పాడు.
వదిలేయాలని సదరు జంట వేడుకోవడంతో డబ్బులు డిమాండు చేశాడు. హోంగార్డు ఆ జంట నుంచి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం రాజు కుమార్, అతని స్నేహితుడు కలిసి మహిళ స్నేహితురాలిని కట్టేశారు. ఆ తర్వాత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరం చేసిన తరువాత, రాజు కుమార్, అతని స్నేహితుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని జంటను బెదిరించి కారులో అక్కడి నుండి పారిపోయారు. బాధితురాలు శుక్రవారం రాత్రి నిందితుడు హోంగార్డు రాజుకుమార్‌పై ఫిర్యాదు చేసినట్లు విజయనగరం దిశ పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పి నారాయణరావు తెలిపారు.
రాజుకుమార్ శ్రీకాకుళం జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారి డ్రైవర్‌గా ప్రాథమిక విచారణలో తేలింది. మే 25న వైజాగ్ సిటీలో పోలీస్ వాహనంలో డీఎస్పీని దింపిన కుమార్.. వైజాగ్ సిటీ నుంచి శ్రీకాకుళం తిరిగి వస్తుండగా హోంగార్డు తన స్నేహితుడిని ఎక్కించుకున్నాడు. శ్రీకాకుళం వెళుతుండగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజు కుమార్, అతని స్నేహితుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేయబడింది.