Vizag: 14 ఏళ్ల బాలికపై స్కూల్‌ ప్యూన్‌ అత్యాచారయత్నం

వైజాగ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన 43 ఏళ్ల వ్యక్తిని దిశా పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  10 July 2023 11:06 AM IST
Vizag, School peon, minor, Crime news

Vizag: 14 ఏళ్ల బాలికపై స్కూల్‌ ప్యూన్‌ అత్యాచారయత్నం 

వైజాగ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన 43 ఏళ్ల వ్యక్తిని దిశా పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు నిందితుడి పొరుగింట్లో ఉంటోంది. ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటన జూన్ 30న జరిగినప్పటికీ, బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలై 6న వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఓ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న కె సత్యారావుగా గుర్తించారు. బాధితురాలు కూడా అదే పాఠశాల విద్యార్థి.

నిందితుడు, బాధితురాలి కుటుంబం గత కొన్నేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (దిశా) సీహెచ్‌ వివేకానంద తెలిపారు. నిందితుడు బాలికతో స్నేహం చేశాడు. జూన్ 30న ఆమెను అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగినప్పటి నుండి, అమ్మాయి నిస్తేజంగా మారింది. తన కుటుంబ సభ్యులతో సహా వ్యక్తులతో మాట్లాడటం మానేసింది. తల్లి గట్టిగా నిలదీయడంతో ఆ బాలిక జరిగిన దారుణాన్ని వివరించింది. అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన కుమార్తె లైంగిక వేధింపులకు గురైందని ఆమె తండ్రి చెప్పగా, ఆ అమ్మాయి మరికొందరి పేర్లను చెప్పింది. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాం అని ఏసీపీ తెలిపారు. నిందితుడిపై ఐపిసిలోని సంబంధిత సెక్షన్లు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Next Story